అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలు కూడా చేస్తూ, కథల ఎంపికలో తనదైన స్టైల్ చూపిస్తోంది. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ ప్రయాణంలో 2025 సంవత్సరం తనకు ఎంతో స్పెషల్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.ఇండస్ట్రీలో తనకు వస్తున్న వరుస ఆఫర్ల పట్ల సంతోషంగా ఉన్నా, ఒక విషయంలో మాత్రం రష్మిక కాస్త అసంతృప్తిగా ఉందట..
సినిమాల్లో తనను ఎప్పుడూ ‘మంచి అమ్మాయి’గా, ‘అమాయకురాలు’గా చూపించడంపై ఆమె స్పందిస్తూ.. ఇకపై అవే రొటీన్ రోల్స్ చేయనని, తనలోని సరికొత్త కోణాలను బయటపెట్టే విభిన్నమైన పాత్రలు చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. నిజ జీవితంలో తాను ఎలా ఉంటానో, దానికి పూర్తి భిన్నంగా ఉండే క్యారెక్టర్లు చేయడమే తనకిష్టమని రష్మిక క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథానాయికగా తన ముద్ర వేయాలని రష్మిక భావిస్తోంది. చిన్నప్పుడు తనకున్న భయాలను, ఆందోళనలను దాటుకుని ఈ స్థాయికి రావడం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని.. తనలోని చిన్న చిన్న మార్పులను కూడా ఒక సక్సెస్‌గా ఫీల్ అవుతూ, అప్పుడప్పుడు తనను తాను మెచ్చుకుంటానని చెప్పుకొచ్చింది. ఏ భాషలో సినిమా చేసినా ప్రేక్షకులను అలరించడమే తన మెయిన్ టార్గెట్ అని, దర్శకులు తనను ఎలా మలిస్తే అలా నటించడానికి సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం ‘మైసా’ సినిమాతో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించబోతున్న రష్మిక, మున్ముందు తన పాత్రలతో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.