Rashmika: ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణేనే అనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు దీపిక పారితోషికంతో పోటీ పడేందుకు సౌత్ నుంచి వెళ్లిన ఓ హీరోయిన్ సిద్ధమవుతోంది. ఆమే… రష్మిక మందన్న! .సౌత్ సినిమాలతో పాటు హిందీలోనూ క్రేజ్ పెంచుకుంటున్న రష్మిక మందన్న రెమ్యునరేషన్ ఇప్పుడు 10 కోట్ల మార్క్‌ను దాటేసింది.
తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్‌లో రష్మిక నటించిన ఇటీవలి చిత్రం ‘థామా’ కోసం ఆమె భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. థామా’ చిత్రంలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానాతో జత కట్టారు. ఈ సినిమాలో రష్మిక కేవలం నటనకే కాకుండా, తన గ్లామర్ రోల్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకోనుందని, ఔట్ అండ్ ఔట్ స్కిన్ షోకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా కోసం రష్మిక రెమ్యునరేషన్ 12 కోట్లుగా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న రష్మిక, బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ, అగ్ర కథానాయిక దీపికా పదుకొణేకు గట్టి పోటీ ఇస్తున్నట్లే భావించవచ్చు. సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన హీరోయిన్ ఇంత భారీ పారితోషికం తీసుకోవడం నిజంగా విశేషం.
READ ALSO: Ramayana: విజువల్ వండర్‌గా ‘రామాయణ’ : నితేశ్ తివారీ