హీరోయిన్ నుండి యాంకర్ గా మరీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది యాంకర్ రష్మి. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా బుల్లి తెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వెండితెర పై కూడా కొన్ని సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.. ఇకపోతే రష్మీ పెట్ లవర్ అనే సంగతి మనకు తెలిసిందే. మూగ జీవాలను ఎంతో ప్రేమించడమే కాకుండా వాటిని ఎవరైనా హింసిస్తే కనుక అసలు ఊరుకోదు.
ఇలా ఎన్నోసార్లు మూగ జీవాలను హింసించిన వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ సోషల్ మీడియా ద్వారా ఉద్యమం చేసింది.. ఇక మూగజీవాలకు హాని చేయొద్దని అందరికీ సూచించడమే కాకుండా రష్మీ ఏకంగా వీగాన్ గా అయితే మారిపోయారు. ఇలా జంతువుల పట్ల ఎప్పటికప్పుడు తన ప్రేమను చాటుకునే రష్మి తాజాగా సోషల్ మీడియా వేదిక గా ఒక బాధాకరమైన వీడియో ను షేర్ చేసింది..సముద్ర తీరాన పదుల సంఖ్య లో తిమింగలాలను చంపుతున్నఒక వీడియో ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినట్లు సమాచారం.. ఇలా తిమింగలాల ను చంపుతుంటే వాటి నుంచి వస్తున్న రక్తంతో సాగర తీరం అంతా కూడా ఎరుపెక్కి పోయింది.ఇలాంటి దారుణమైన ఒక వీడియోని రష్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రాక్షసులు ఎక్కడ కూడా వుండరు.. ఇలాంటి వాళ్ల రూపం లో మన చుట్టూనే తిరుగుతూ మనతోనే ఉంటారు అంటూ కామెంట్ ను కూడా చేశారు. ఇలా రష్మీ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఈ వీడియో పై పలువురు రష్మికి మద్దతు తెలుపుతున్నారు. అలాగే మరికొందరు రష్మీ పట్ల విమర్శలను చేస్తూ నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.