Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు
- తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తా.. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్‌పై దృష్టి పెడతాం.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rammohan Naidu: ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు. మోడీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను కోరారని.. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్‌పై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. టైర్-2, టైర్-3 నగరాలకు కూడా విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సామాన్యులు విమానాల్లో ప్రయాణించేలా ప్రయత్నం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను రికార్డు సమయంలో పూర్తి చేస్తామన్నారు. విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ పెంచాలనే డిమాండ్ ఉందని.. సివిల్ ఏవియేషన్‌కు బెస్ట్ మోడల్‌గా ఏపీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఐదేళ్లు పౌర విమానయాన శాఖలో బలమైన పునాదులు వేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
Read Also: Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
పర్యావరణ అనుకూలంగా తన మంత్రిత్వ శాఖను తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. పర్యావరణ హితంగా తమ శాఖను తీర్చిదిద్దుతామని రామ్మోహన్ చెప్పారు. ఎయిర్ పోర్ట్‌లకు కావాల్సిన బడ్జెట్ లభిస్తుందన్నారు. 2014లో అశోక్ గజపతి కేంద్ర మంత్రిగా విమానయాన మంత్రిత్వ శాఖను నిర్వహించారని, ఆయన వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో విమాన యాన రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని, ఆయన దార్శనికతతోనే విమానయాన రంగం ముందుకు వెళ్లిందన్నారు. ఉడాన్ స్కీమ్‌ను అశోక్ గజపతి హయంలోనే ప్రారంభించారని ఎంతోమంది దాని ద్వారా విమానయానం అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలో మరింత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విమానయానశాఖలో సింధియా అమలు చేసిన సంస్కరణలు కొనసాగిస్తామన్నారు. గత పదేళ్లుగా వికసిత్ భారత్‌లో భాగంగా విమానయాన రంగంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఏపీలోని రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ అవసరాలను కూడా గుర్తించి వారికి సహకరిస్తామని తెలిపారు. తెలంగాణలో కూడా విమానయానం అవసరాలను తీర్చేందుకు సహకారం అందిస్తామన్నారు.
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!