ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు.