Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rakasa Teaser Talk Sangeeth Sobhan Release Date

Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published Date :March 1, 2026 , 7:18 pm
By Gogikar Sai Krishna
  • హారర్ కామెడీగా ‘రాకాస’.. టీజర్‌తో అంచనాలు పెంచిన సంగీత్ శోభన్
  • నిహారిక నిర్మాణంలో వెరైటీ కంటెంట్
  • భారీ తారాగణంతో వస్తున్న రాకాస
  • ఏప్రిల్ 3, 2026న గ్రాండ్ రిలీజ్
Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rakasa Teaser Talk in telugu : ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సంగీత్ శోభన్, ఇప్పుడు ఒక వెరైటీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ముందుకు రాబోతున్నారు. మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రాకాస’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Internet Shutdown: శ్రీనగర్‌లో ఇంటర్నెట్ క్లోజ్.! భారీ నిరసనలతో అలజడి.!

టీజర్ ఎలా ఉందంటే?
“నరకం నుంచి సందేశం వస్తుంది”, “మన ఊరి శాపం ఇది” అనే సీరియస్ డైలాగ్స్‌తో టీజర్ ప్రారంభమై ఆకట్టుకుంటోంది. అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడు తన సొంత ఊరిలోని ఒక పాత బంగ్లాలో చిక్కుకోవడం, అక్కడ అతనికి ఎదురైన వింత అనుభవాలు ఏంటి? అసలు ఆ ఊరికి ఉన్న శాపం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అన్న కోణంలో టీజర్ సాగింది. ఒకవైపు భయపెడుతూనే, మరోవైపు సంగీత్ శోభన్ మార్కు కామెడీతో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

నిర్మాణ విలువలపై నిహారిక ముద్ర
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నేషనల్ లెవల్లో సక్సెస్ అందుకున్న నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి ఆమె ఈ మూవీని రూపొందిస్తున్నారు. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

భారీ తారాగణం
సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ , ’90s’ సిరీస్ ఫేమ్ రోహన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారర్ , కామెడీ మేళవింపుతో రానున్న ఈ ‘రాకాస’ చిత్రం 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.

Putin Rection : ఇది ‘క్రూరమైన హత్య’.. ఖమేనీ మృతిపై పుతిన్ రియాక్షన్..

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NIharika Konidela
  • Rakasa movie
  • Rakasa Teaser
  • Sangeeth Sobhan
  • Telugu horror comedy

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మేం దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్!

  • Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

  • Iran: ‘‘ఇది ముస్లింలపై యుద్ధం’’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్..

  • Ind vs WI: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సూర్య.. రింకూకు నో ఛాన్స్.. వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు!

  • Breaking News: మోడీ అధ్యక్షతన అత్యున్నత CCS సమావేశం..

  • Salman Ali Agha: “నిన్ను తీసేస్తారా? నువ్వే రిజైన్ చేస్తావా?”.. జర్నలిస్ట్ ప్రశ్నకు పాకిస్థాన్ కెప్టెన్ షాకింగ్ ఆన్సర్!

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions