BJP MP Slaps Employee: ఈ మధ్యం ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయంగా ఏదైనా పని చేయించుకోవాలంటే చెప్పులు అరిగేలా తిరగాల్సిందే. అదే లంచం ఇస్తే వెంటనే పని పూర్తయిపోతుంది. కొన్నిసార్లు అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కుతుంటారు. తాజాగా లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించారు ఓ బీజేపీ ఎంపీ. ప్రభుత్వ కార్యాలయంలో భూమికి సంబంధించిన పట్టాల విషయంలో ఓ రైతు వద్ద డిమాండ్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఎంపీ కలగజేసుకుని సదరు అధికారి చెంప చెల్లుమనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
India Reaction: ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం.. స్పందించిన భారత్
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎంపీ చంద్రప్రకాష్ జోషి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ రైతు ఎంపీ వద్దకు వచ్చి అధికారి లంచం అడుగుతున్నాడని తన గోడును వెళ్లబోసుకున్నాడు. గత కొంతకాలంగా తన భూపట్టాలకు సంబంధించి బదలాయింపు విషయంలో ప్రభుత్వ ఉద్యోగి వేధిస్తున్నాడని, ఎంతగా వేడుకుంటున్నా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడని.. రూ.5 వేలు ఇస్తే పని కాదని చెప్పినట్లు ఎంపీకి తెలిపాడు ఆ రైతు. వెంటనే స్పందించిన ఎంపీ సదరు ఉద్యోగిని పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎంపీ సీపీ జోషి ఆ ఉద్యోగిని నిలదీస్తున్న సమయంలో.. 15వేలు లంచం అడిగినట్లు కొందరు రైతులు ఎంపీ ఎదుట నినాదాలు చేశారు. దీంతో, రైతులు, ఉద్యోగుల ముందే లంచం అడిగిన ఉద్యోగిపై ఎంపీ చేయిచేసుకున్నారు. ప్రభుత్వం నెల నెల జీతం ఇస్తున్నప్పటికీ ఇలా రైతుల వద్ద డబ్బులు డిమాండ్ చేయడం ఎంత వరకు న్యాయం అని ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి వ్యవహారం తన వద్దకు వస్తే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, డిపార్ట్మెంట్ ఉద్యోగుల ముందే చెయ్యి చేసుకోవడం వల్ల ఆ ఎంపీపై విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
चित्तौड़गढ़ से भाजपा सांसद चंद्र प्रकाश जोशी ने एक सरकारी कर्मचारी को सार्वजनिक रूप से थप्पड़ मार दिया। वीडियो सोशल मीडिया पर वायरल। pic.twitter.com/JdSLXjcsFB
— Priya singh (@priyarajputlive) November 3, 2022