Site icon NTV Telugu

Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!

Ss Rajamouli Varanasi

Ss Rajamouli Varanasi

‘బాహుబలి’, ‘RRR’ వంటి సంచలనాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సైన్స్ ఫిక్షన్‌ను జోడించి చూపిస్తున్న ఒక విజువల్ వండర్. అయితే
సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి ఈ సినిమా కోసం నేరుగా పారితోషికం తీసుకోకుండా,

Also Read : Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’

సినిమాకు సంబంధించిన మొత్తం ఓవర్సీస్ (విదేశీ) హక్కులను తన రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ. 160 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా. ‘RRR’తో అంతర్జాతీయంగా తనకు వచ్చిన గుర్తింపును ఈ విధంగా క్యాష్ చేసుకోవాలని ఆయన ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మహేశ్ బాబు కూడా ఈ సినిమాలో కేవలం నటుడిగానే కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నారట. దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఆయనకు రెమ్యూనరేషన్ రూపంలో అందే అవకాశం ఉందని సమాచారం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమెకు సుమారు రూ. 30-40 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు టాక్. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో టైమ్ ట్రావెల్.. పురాణాల మేళవింపు ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమౌళి బ్రాండ్ మరియు మహేశ్ బాబు క్రేజ్ కలిసి ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Exit mobile version