Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బాహుబలి’, ‘RRR’ వంటి సంచలనాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సైన్స్ ఫిక్షన్‌ను జోడించి చూపిస్తున్న ఒక విజువల్ వండర్. అయితే
సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి ఈ సినిమా కోసం నేరుగా పారితోషికం తీసుకోకుండా,
Also Read : Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
సినిమాకు సంబంధించిన మొత్తం ఓవర్సీస్ (విదేశీ) హక్కులను తన రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ. 160 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా. ‘RRR’తో అంతర్జాతీయంగా తనకు వచ్చిన గుర్తింపును ఈ విధంగా క్యాష్ చేసుకోవాలని ఆయన ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మహేశ్ బాబు కూడా ఈ సినిమాలో కేవలం నటుడిగానే కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నారట. దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఆయనకు రెమ్యూనరేషన్ రూపంలో అందే అవకాశం ఉందని సమాచారం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమెకు సుమారు రూ. 30-40 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు టాక్. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో టైమ్ ట్రావెల్.. పురాణాల మేళవింపు ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమౌళి బ్రాండ్ మరియు మహేశ్ బాబు క్రేజ్ కలిసి ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!