పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ డ్రామా సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్‌ను గత కొంతకాలంగా సీరియస్ రోల్స్‌లో చూస్తున్న ఫ్యాన్స్‌కు, ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్‌ను, ఆయనలోని కామెడీ టైమింగ్‌ను మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్‌ను మళ్లీ చూసే అవకాశం దక్కబోతోంది. ఇప్పటికే విడుదలైన ‘రెబల్ సాబ్’, ‘సహానా సహానా’ పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ ప్లేస్‌లో ఉండగా, తాజాగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ఐటమ్ సాంగ్ ‘నాచే నాచే’ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Also Read : Dhurandhar-Raja Saab : ధురంధర్ దూకుడుకు.. ప్రభాస్ ‘రాజా సాబ్’ బ్రేక్ వేయగలదా ?
బాలీవుడ్ ఐకానిక్ చిత్రం ‘డిస్కో డ్యాన్సర్’లోని సూపర్ హిట్ సాంగ్ ‘నాచే నాచే’ను సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లతో కలిసి స్టేజ్‌పై చేస్తున్న సందడి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కలర్‌ఫుల్ సెట్స్, అదిరిపోయే కాస్ట్యూమ్స్ మరియు ప్రభాస్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనిపిస్తోంది.
ముగ్గురు భామల గ్లామర్ మరియు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను జనవరి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని మాస్ ఎలిమెంట్స్, కామెడీ మరియు కమర్షియల్ హంగులతో ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
Dear Darlings,
This is our promise to you…#NacheNache will see #Prabhas bring the HIGH with his moves this Sankranthi 🔥
It will be an eye feast.#NacheNache #TheRajaSaab @MusicThaman pic.twitter.com/KWG8KMpsbn
— The RajaSaab (@rajasaabmovie) January 3, 2026