కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను"మెంబర్ ఆఫ్ పార్లమెంట్"గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత రాహుల్‌గాంధీ బయో గతంలో "డిస్ క్వాలిఫైడ్ ఎంపీ" అని ఉండేది.
2011లో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కటారియాకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక మేజిస్ట్రేట్ రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారిస్తూ ఈ ఉత్తర్వును ప్రకటించారు.