Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
- పీఎం మోడీ నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నా..
- ఖర్గే పుట్టిన రోజు ఉపయోగించుకుని సీక్రెట్ ఆపరేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: విద్యార్థులు, నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తారని పోలీసులు పసిగట్టలేకపోయారు. దీని వెనక రాహుల్ గాంధీ సీక్రెట్ ప్లాన్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నివాసానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసానికి ధర్నాగా వెళ్లారు. ఈ వ్యూహాత్మక చర్యతో మీడియాతో పాటు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మొదట ఖర్గే బర్త్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు 10రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసానికి కాంగ్రెస్ నేతలు చేరారు. అక్కడి నుంచి సుమారు 2.3 కిలోమీటర్ దూరంలో ఉన్న 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఈ ఆకస్మిక చర్య తర్వాత కాంగ్రెస్ పార్టీతో కేంద్రం చర్చలు ప్రారంభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా ధర్నా స్థలికి వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించారు.
Also Read
సీక్రెట్ ప్లాన్ సక్సెస్:
మొదట పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత విజయ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ భావించింది. అయితే, సమాచారం ముందుగానే లీక్ కావడంతో పోలీసులు అడ్డుకుంటానే అంచనాతో ప్లాన్ మార్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ఖర్గే పుట్టినరోజు భోజనానికి వస్తున్నట్లుగా సీనియర్ నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో భద్రతా సిబ్బందికి ఎలాంటి అనుమానం రాలేదు. అక్కడి నుంచి ఒక్కసారిగా రాహుల్ గాంధీతో సహా ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసం వైపు వెళ్లారు. ఈ అనూహ్య పరిణామాలను ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పసిగట్టలేకపోయాయి.
తాజావార్తలు
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్‌గాంధీ, ఖర్గే
-
Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!