CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
- సీజేపీ అధికార ప్రతినిధి ‘‘బర్గర్ వీడియో ’’ వైరల్..
- ఉద్యమ విలువలకు విరుద్ధంగా ప్రవర్తించారన్న పార్టీ..
- పదవి నుంచి తొలగించిన సీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: పార్లమెంట్ మార్చ్ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధికార ప్రతినిధి విజేత దహియా ‘‘బర్గర్’’ తినడం వైరల్‌గా మారింది. బర్గర్ వీడియో వివాదం నేపథ్యంలో సీజేపీ అతడిని పదవి నుంచి తొలగించింది. సోమవారం జరిగిన నిరసన మార్చ్ సందర్భంగా విజేత దహియా బర్గర్ తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై దహియా స్పందిస్తూ.. ‘‘నేను బర్గర్ ఎందుకు తిన్నాను..? ఆకలిగా ఉండటంతో లేదా తినాలనిపించడంతో తిన్నాను అంతే’’ అని చెప్పారు. ‘‘నేను ఎవరికి జవాబుదారీని కాదు, నేను దేశం కోసం స్వచ్ఛందంగా చేస్తున్నాను, బర్గర్ తింటాను కూడా’’ అంటూ వ్యాఖ్యానించారు.
అయితే, తీవ్రమైన నిరసన జరుగుతున్న సమయంలో సీజేపీ అధికార ప్రతినిధి ఇలా బర్గర్ తింటూ ప్రవర్తించడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడిని పదవి నుంచి తొలగించింది. ఉద్యమ విలువలకు విరుద్ధంగా ప్రవర్తించడాన్ని ఖండించింది. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం, ఈ ఘర్షణల్లో 178 మంది గాయపడగా, ఇందులో 118 మంది పోలీసులు ఉన్నారు. మరో 60 మంది నిరసనకారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
Vijeta Dahiya ..
"Did you elect me? Why should I go to your protest? Am I accountable to you? Am I here to appease you fools? I was hungry, so I ate a burger. If you want to think nonsense, go ahead."
The CJP spokesperson called students to the protest yesterday, let them face… pic.twitter.com/R55Zy5pxjb
— Surbhi (@SurrbhiM) July 21, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు