CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
- యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం
- రాహుల్ గాంధీ చేతుల్లోకి ఉద్యమం
- క్షణాల్లో సీన్ మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన సీజేపీ ఉద్యమం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఈరోజు ఉదయం వరకు ఒకెత్తు.. మధ్యాహ్నం నుంచి మరోకెత్తుగా మారిపోయింది. విచిత్రంగా బొద్దింకల జనతా పార్టీ ఉద్యమం ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. ఒక్క రోజులోనే రాజధానిలో వాతావరణం మారిపోయింది. ఉద్యమంలోకి రాహుల్ గాంధీ దిగడంతో ఉద్యమం కాస్త కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ కూడా చురుకుగా పాల్గొంది.
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ‘బొద్దింకల జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసింది. సోమవారం యువ విద్యార్థులు, బొద్దింకల పార్టీ నాయకులపై దృష్టి సారించిన ఈ ఉద్యమం… మంగళవారం రాహుల్ గాంధీ వైపు మళ్లడంతో చర్చ తీవ్రరూపం దాల్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే తన ఏకైక డిమాండ్ అని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఒకవేళ ఇది జరగకపోతే… రాత్రంతా ప్రధానమంత్రి నివాసం బయటే గడుపుతానని ప్రకటించారు.
Also Read
ప్రధానమంత్రి నివాసం బయట నిలబడి ఉన్న కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. 120 మంది ఎంపీలు తనతో ఉన్నారని పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీసన్ కూడా చేరుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ బయటకు వచ్చి రాహుల్ గాంధీని కలిసి.. డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పారు. అంతేకాకుండా నీట్ పేపర్ లీక్ విషయంపై సభలో చర్చిస్తామని తెలిపారు. అయితే రాహుల్ గాంధీ తాను తన డిమాండ్లకు కట్టుబడి ఉన్నానని స్పష్టంగా చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాను ఇక్కడి నుంచి వెళ్లనని అన్నారు. అంతేకాకుండా తాను రాత్రికి ఇక్కడే ఉంటానని కూడా తెలిపారు.
ఇదిలా ఉండగా బొద్దింకల జనతా పార్టీ నుంచి ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసిందా అనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మీడియా కెమెరాల్లో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు మాత్రమే కనిపించారు. సోనమ్ వాంగ్‌చుక్, అభిజిత్ దీప్కేల ప్రస్తావనే లేదు. దీంతో ఉద్యమం బొద్దింకల జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి జారిపోతున్నట్లు కనిపిస్తోంది.
డింపుల్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు నిరసనకారుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి వీధుల్లోకి వచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ నిశ్శబ్దంగా ఒక యాత్రకు నాయకత్వం వహించి.. ఆ తర్వాత ప్రధానమంత్రి నివాసానికి వెళ్లారు. దీం ఈ ఉద్యమం మొత్తం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య పోరుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఇప్పుడు నాయకుడిగా ఎదుగుతుండటంతో, దీర్ఘకాలంగా బలహీన పార్టీగా పరిగణించబడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద అవకాశం. మమతా బెనర్జీ కూడా ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!