రాచకొండ పరిధిలో చైన్ స్నాచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసులో ఓ బాధితురాలు ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో డయల్ 100కు ఫోన్ చేయగా.. రెండు గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు సీపీ చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన ఓ వృద్దురాలి మెడలో నుంచి హోలీ పండగ రోజు గుర్తు తెలియని వ్యక్తులు 3 తులాల పుస్తెల తాడు తెంపుకుపోయారు.
హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. చైన్ స్నాచింగ్ ఘటనలతో అప్రమత్తమయ్యారు రాష్ట్ర పోలీసులు. తెల్లవారు జామునుంచే స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై పోలీసుల తనిఖీలు చేస్తున్నారు.
సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హడల్ ఎత్తిస్తున్నారు. తెంపుడుగాళ్ళు రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది. గంటల వ్యవధిలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.