Aditi Rao Hydari: అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇక ఈ సినిమా తరువాత అదితికి మంచి అవకాశాలే వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ నే నమ్ముకుంది. ఇక ఎన్ని సినిమాలు చేసినా అదితికి రాని పేరు.. హీరో సిద్దార్థ్ తో ఆమె నడుపుతున్న ప్రేమాయణం ద్వారా వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిత్యం వీరిద్దరూ ముంబై వీధుల్లో జంటగా కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఏ ఈవెంట్ కి అయినా ఏ ఫంక్షన్ కు అయినా ఇద్దరు జంటగా రావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అర్థమవుతుంది. కానీ, ఎప్పుడు వీరు తమ రిలేషన్ గురించి అధికారికంగా చెప్పలేదు. దీంతో మీరు అసలు పెళ్లి చేసుకుంటారా..? లేదా..? అనే అనుమానం అభిమానుల్లో ఎక్కువైపోతుంది.
Aditi Shankar: ఏంటి శంకర్ సర్.. కూతురుకు అలాంటి కండీషన్ పెడితే ఎలా.. ?
ఇక ప్రస్తుతం సిద్దార్థ్, అదితి తమ కెరీర్ ను చక్కదిద్దుకొనే పనిలో పడ్డారు. ప్రస్తుతం అదితి, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తున్న హీరామండి అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇంకో పక్క మరో రెండు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని టాక్. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఈ మధ్య అదితి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందాల ఆరబోతతో కుర్రాళ్ళ గుండెలను మత్తెక్కిస్తుంది. తాజాగా ఆమె ఎద అందాలను ఆరబోసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్లోరల్ స్లీవ్ లెస్ డ్రెస్ లో ముద్దుగుమ్మ ముద్దొస్తోంది. ముఖ్యంగా ఎద అందాలను ఆరబోసి పొందిగ్గా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లు పోజులు ఇచ్చింది. దీంతో నెటిజన్స్ సిద్దార్థ్ గర్ల్ ఫ్రెండ్ హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తోందో చూడాలి.