రాచకొండ పరిధిలో వినాయక నిమ్మజ్జనోత్సవంకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అని రాచకొండ కమిషనర్ చౌహాన్ తెలిపారు. సాఫీగా, సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాము.. దేశంలోనే తెలంగాణలో ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగే నిమజ్జనం పెద్దదని భావిస్తున్నాం.. ఇతర ప్రాంతాల నుంచి నిమజ్జనం చూడటానికి వస్తారు అని ఆయన అన్నారు. ఈ ఏడాది ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాము.. ఎక్కడైనా అనుమానిత వస్తువు కనపడ్డ, అనుమానిత వ్యక్తులు కనిపించిన డయల్ 100 కు కాల్ చేయండి అని రాచకొండ సీపీ చౌహాని పిలుపునిచ్చారు.
Read Also: India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాదం కోసం పంజాబ్ యువతకు వల..
రాచకొండ పరిధిలో సుమారు 11 వేల విగ్రహాలు నిమజ్జనం జరుగనున్నాయని సీపీ చౌహాన్ తెలిపారు. బాలాపూర్ గణనాథుడు లడ్డూ వేలం ముగిసిన తరువాత నిమజ్జనానికి మధ్యాహ్నం 12 గంటలకు కదిలే అవకాశం ఉంది.. పికెట్లను ఏర్పాటు చేశాము, 3600 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం.. మరో వెయ్యి మందితో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము.. సుమారు 6 వందల మంది ట్రాఫిక్ సిబ్బంది వినాయక నిమజ్జన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తారు.. 56 చిన్నా, పెద్ద చెరువులు ఉన్నాయి.. షీటీమ్స్, క్రైమ్ టీమ్ లతో పాటు వాచ్ టవర్స్ ఏర్పాటు చేశాం.. మొత్తం 11 వేల విగ్రహాలు రిజిస్టర్డ్ చేసుకున్నారు.. ఇంకా రిజిస్టర్ చేసుకొని విగ్రహాలు చాలానే ఉంటాయని సీపీ చౌహాన్ వెల్లడించారు.