పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు రాచకొండ కమిషనర్ అండగా నిలిచారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐ ఎల్ బినగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్యని కలిసి సమస్య వివరాలు ఆరా తీశారు. భూమి పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకుంటామని మొగులయ్యకు హామీ ఇచ్చారు. అనంతరం కమీషనర్ పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించారు.
READ MORE: Sanju Samson: టీమిండియాలో మళ్లీ అవకాశం వస్తుందని ఊహించలేదు: శాంసన్
అసలేం జరిగింది…
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకి తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం, భాగ్ హయత్ నగర్ సర్వే నెం.159 లో 600 గజాల భూమిని మంజూరు చేసింది. ఆయన సదరు ఫ్లాట్ కు చుట్టూ ఫ్రీ కాస్ట్ గోడ నిర్మించుకున్నారు. ఈనెల11న ఉదయం 08:00 గంటలకు మొగులయ్య తన ప్లాట్ వద్దకు వెళ్లి చూసేసరికి ఉత్తరం వైపు ఉన్న ఫ్రీ కాస్ట్ గోడను గుర్తుతెలియని వ్యక్తులు కూలగొట్టినట్లు గుర్తించారు. ఈనెల 11న హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు మొగులయ్య గారిని నేడు ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. ఆ భూమి పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకుంటామని కేసులో తదుపరి విచారణ చేసి నిందితులను పట్టుకొని చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మనోహర్, హయత్ నగర్ సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు
READ MORE:TGSRTC MD VC Sajjanar: బస్సు ఛార్జీలు పెంపుపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ..