పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు రాచకొండ కమిషనర్ అండగా నిలిచారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐ ఎల్ బినగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్యని కలిసి సమస్య వివరాలు ఆరా తీశారు.
కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య తాజాగా, ఓ వీడియోలో బీజేపీ నేతల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 1 కోటిని ప్రస్తావిస్తూ.. తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు. అవసరమైతే పద్మ శ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తన నోట్లె మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ…
పద్మశ్రీ కిన్నెర దర్శనం మొగులయ్య, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దంపతులు ఆదివారం ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామిని వారి ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి ముందు కిన్నెర మొగులయ్య తన కళను ప్రదర్శించారు. దాంతో ఈ కళను చిన్న జియర్ స్వామి అభినందించారు. మరికొంతమందికి ఈ కళను నేర్పించాలని మొగులయ్యకు సూచించారు. అనంతరం మొగులయ్యను చిన్న జీయర్ స్వామి సన్మానించారు. ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని…
ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. పద్మ అవార్డుల తుది జాబితాకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో.. ఆ జాబితాను ఇవాళ కేంద్ర హోంశాఖ విడుదల చేసింది.. నలుగురికి పద్మవిభూషన్, 17 మందికి పద్మభూషన్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి.. అందులో మొగిలయ్య ఒకరు.. ఆయనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు…
’12 మెట్ల కిన్నెర ‘కళాకారుడు కిన్నెర మొగులయ్య ఇటీవల విడుదలైన “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ లో తన గాత్రదానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు “భీమ్లా నాయక్” సాంగ్ తో ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కన్పించాడు. ఆయనకు తాజాగా పవన్ కళ్యాణ్ నుండి భారీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట విశేష ఆదరణ పొందింది. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కనిపిస్తాడు. ఆడాగాదు ఈడాగాదు… అమీరోళ్ల మేడాగాదుగుర్రం నీళ్ల గుట్టాకాడ… అలుగూ వాగు తాండాలోనబెమ్మా…