పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు , విద్యా శాఖ కార్యాలయాల ముట్టడి చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేత వేముల రామకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల ఫీజు రియంబర్స్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, విద్యార్థులకు స్కాలర్ షిప్ ఏడాదికి రూ.5,500 నుండి 20 వేలకు పెంచాలని డిమాండ్ చేసారు.
Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలేజీ యజమాన్యాలు కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత కోర్సుల్లో సీట్లు వచ్చినా.. చదవలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలపై మొదటి ప్రాధాన్యతగా బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
AP Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు