Pydithalli Sirimanotsavam: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది.. అమ్మవారిని దర్శించుకు నేందుకు భక్తులు పోటెత్తారు.. అయితే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లి సిరిమానోత్సవానికి ఈ నెల 4వ తేదీన అంకురార్పణ జరిగింది. ఇక, 30న తొలేళ్లు ఉత్సవం జరగగా.. ఈ రోజు సిరిమానోత్సం జరుగనుంది.. పందిరిరాటకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. అమ్మవారి ఆలయం నుంచి కోట గుమ్మం వరకు మూడు సార్లు సిరిమాను రథం తిరనుంది.. సిరిమానును అధిరోహించనున్నారు పూజారి బంటుపల్లి వెంకట రావు.. సిరిమానోత్సవాన్ని తిలకించనున్న వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు..
అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని గతంలోనే ఈవో సుధారాణి ప్రకటించారు.. అక్టోబర్ 30న తొలేళ్ల ఉత్సవం నిర్వహించారు.. ఈ రోజు అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరగనుంది.. ఇక, నవంబర్ 7వ తేదీన పెద్దచెరువు వద్ద తెప్పోత్సవం, 14వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించనున్నారు.. ఇక, అక్టోబర్ 4వ తేదీ మండల దీక్షలు ప్రారంభం అయ్యాయి.., అక్టోబర్ 25న అర్ధమండలి దీక్షలు ఆరంభించారు.. వచ్చే నెల 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు వనం గుడి నుంచి కలశ జ్యోతి ఊరేగింపు నిర్వహించనున్నారు.. 15వ తేదీన ఛండీహోమం, పూర్ణాహుతితో వనంగుడి వద్ద దీక్ష విరమణతో ఉత్సవాలు ముగించనున్నారు..