శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బొత్స కుటుంబం విజయనగరంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. బొత్స కుటుంబంకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయగా.. సిరిమానోత్సవం ప్రారంభమైన కాసేపటికే వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో బొత్స కుటుంబ సభ్యులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిమానోత్సవ తిలకానికి ప్రత్యేకంగా అర్భన్ బ్యాంక్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా…
Pydithalli Ammavaru Sirimanotsavam 2025: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.. మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.. హుక్కుం పేటలో సిరిమానుకు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.. పైడితల్లి అమ్మావారి సిరిమానోత్సవ సందర్భంగా నగరపాలక…
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది.. అమ్మవారిని దర్శించుకు నేందుకు భక్తులు పోటెత్తారు.. అయితే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.