YoungMan Suicide: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. బుల్లెట్ బండి, ఫోను కొనివ్వలేదన్న కోపంలో 18సంవత్సరాల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుష్మా అనే మహిళ తన ఇద్దరు కుమారులు పీయూష్, పరాస్ తో కలిసి నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జీవిస్తున్నారు. పీయూష్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, 18ఏళ్ల పరాస్ కాలికి పక్షవాతం రావడం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా తల్లిని బుల్లెట్ బైకు, మొబైల్ ఫోను కొనివ్వాలని అడుగుతున్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో మనస్థాపం చెందిన పరాస్.. గదిలో ఫాన్‌కు ఉరేసుకున్నాడు. తల్లి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే పరాస్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఏడాది క్రితం సైకిల్ కొనివ్వందుకు అలిగిన పరాస్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిసింది.
Read Also: Andhra News: అనంతపురంలో వర్ష బీభత్సం.. ఇళ్లలోకి భారీగా వరద నీరు
ఇదిలా ఉంటే.. కేఎల్‌యు భవనంపై నుండి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వడ్డేశ్వరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన యశ్వంత్‌రెడ్డి వడ్డేశ్వరంలోని కెఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వర్సిటీ హాస్టల్లో ఉంటూ తరగతులకు హాజరవుతున్నాడు. దసరా సెలవుల అనంతరం సోమవారం రాత్రి వర్సిటీకి వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో వర్సిటీ భవనంపై నుండి యశ్వంత్‌రెడ్డి కిందకి దూకాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను వర్సిటీ యాజమాన్యం హుటాహుటిన తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.