Instagram Fraud: ఓ అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని వేధిస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్‌కు చెందిన బీటెక్ విద్యార్థి ఎస్.జిష్ణు కీర్తన్‌రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫొటోలు, వివరాలను పెట్టి ఓ బాలిక పేరుతో నకిలీ ఖాతాను సృష్టించాడు. ఆ అమ్మాయి పేరుతో చాటింగ్ చేస్తూ నమ్మకం పెంచుకున్నాడు.. చాలా మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. తన న్యూడ్ ఫోటోలుగా పోజులిచ్చి ఇతర అమ్మాయిల ఫోటోలను సేకరించేవాడు. సేకరించిన ఫొటోలను ఆమెకు చూపిస్తూ ప్రతిరోజూ తన నగ్న చిత్రాలు, వీడియోలు పంపించాలని.. లేకుంటే తన దగ్గరున్న ఫొటోలు, వీడియోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తానని వేధించేవాడు. దీంతో వేధింపులు తట్టుకోలేని ఓ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసునమోదు చేసుకున్న సైబర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు జిష్ణుకీర్తన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడు చాలా మంది బాలికలను వేధించినట్లు పోలీసులు గుర్తించారు.
Read also: OTT Movie: కొత్త కాన్సెప్ట్ తో మూవీ.. ఇన్నాళ్లకు ఓటీటిలోకి..
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్పాన్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన కొత్త వ్యక్తులతో స్నేహం చేయవద్దని, వారితో సమాచారం, వీడియోలు, ఫొటోలు పంచుకుని చిక్కుల్లో పడకూడదని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. విద్యార్థులు, యువతులు, మహిళలు ఖాతాలతో ప్రమాదం పొంచి ఉందని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే చిత్రాలను, వ్యాఖ్యలను ‘లైక్’ చేయడం ప్రమాదాలను తెచ్చిపెడుతుందని అన్నారు. స్నేహితులతో గడిపిన సందర్భాలు, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, సెలవులు, పెళ్లిళ్ల సందర్భంగా తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుండటంతో సైబర్ నేరగాళ్లు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి ప్రవేశించిన నేరగాళ్లు యువతులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. నిందితుల్లో బాధితులకు తెలిసిన వారు కూడా ఉండడం గమనార్హం అన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలను నేరగాళ్లు డౌన్ లోడ్ చేస్తున్నారు. తమ చిత్రాలను అసభ్యకరంగా మార్చి ఈ ఖాతాలో పెడుతున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా యువతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Redmi Note 13 Price: రెడ్‌మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ధర, ఫీచర్లు ఇవే!