Hyderabad Students: అటు జేఎన్టీయూ.. ఇటు ఓయూ.. విద్యార్థినుల ఆందోళనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Students: హైదరాబాద్‌లోని అటు జేఎన్టీయూ, ఇటు ఓయూ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ మెస్‌లో ఆహారం సరిగా లేదని జేఎన్‌టీయూ విద్యార్థినికులు నిరసన చేపట్టారు. మరోవైపు ఓయూలో రాత్రి పూట కొందరు దండగులు గది డోర్ లు కొడుతున్నారని గేట్లు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. జేఎన్ టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ.. తినే ఆహారంలో పురుగులు, బొద్దింకలు, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని ఆరోపించారు. కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి భోజనం సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు సరిపడా ఆహారం అందడం లేదంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. డౌన్ డౌన్ ప్రిన్సిపాల్ అంటూ ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేసిన వారిపైనే ప్రిన్సిపాల్ దాడులు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం వెళితే.. సాయంత్రం 6 గంటలలోపు మెస్ తలుపులు మూసేస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా ఎందుకు వెళ్తున్నారు? కాలేజీలో ఎక్కడపడితే అక్కడ కూర్చోవడం దేనికి అని అడుగుతున్నారని అన్నారు. హాస్టల్ మెస్ సరిగా లేదని, మెస్‌లోనే లైటింగ్ లేక చీకట్లో భోజనం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించగా.. మీ కోసం ఇంద్ర భవనం కట్టలేమని హేళనగా చెబుతున్నారని పీజీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే హాస్టల్ ఖాళీ చేయిస్తానని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు. ఇక మరోవైపు ఓయూ విద్యార్థుల మాట్లాడుతూ.. ఓయూ లేడీస్ హాస్టల్‌లో రాత్రిపూట కొందరు దుండగులు గది తలుపులు కొడుతున్నారని దీంతో భాయాందోళనకు గురవుతున్నామని అన్నారు. లేడీస్ హాస్టల్ వైపు రాత్రి పూట ఏం జరుగుతుందో అని భయాందోళనకు చెందుతున్నామని అన్నారు. హాస్టల్‌లో సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఓయూ గేట్లను మూసివేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీసీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలపై స్పందించి వారికి సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Tirumala: డిసెంబర్‌లో 19.16 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం..
తాజావార్తలు
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!