బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని, నిజామాబాద్ ఎంతో ముందడుగు వేసిందన్నారు పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కులతార్ సింగ్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంజాబ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్, డిప్యూటీ స్పీకర్ జై సింగ్ రౌడీ ,.ఎం. పి. విక్రమ్ జిత్ సింగ్ సహని, ఎమ్మెల్యేలు కుల్వంత్ సింగ్ పండోరి, అమర్ జీత్ సింగ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్పీకర్ కులతార్ సింగ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ బాగా అభివృద్ధి చెందింది అన్నారు.
Read Also: Rahul Gandhi: బీజేపీ హిందూ-ముస్లిం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది.. ఇది అంబానీ-అదానీ ప్రభుత్వం..
భారత దేశం ప్రపంచం గురువుగా ఉంది..ఢిల్లీలో మా ప్రభుత్వం అన్ని ఉచితంగా ఇస్తుంది..ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చదువు, వైద్యం పేదలకు ఉచితంగా ఇస్తున్నాం..పంజాబ్ లో ఉచిత కరెంట్ ఇస్తున్నాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో వచ్చి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడితే రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయి..రైతులు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుంది.. రైతుబందు పథకంతో రైతులకు మేలు జరుగుతుంది..రైతుకు మంచి చేస్తేనే దేశానికి మంచి జరుగుతుందన్నారు.
రైతుల బిడ్డలే సైనికులుగా మారారు. కేసీఆర్, కేజ్రీవాల్ లతో దేశంలో రైతు రాజ్యం సాధ్యం అన్నారు కులతార్ సింగ్. కల్యాణ లక్ష్మీ,, షాదీ ముబారక్ పథకాల వల్ల పేదలకు మేలు జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా అంతా కేసీఆర్ కి మద్దతివ్వాలన్నారు కులతార్ సింగ్.
Read Also: Mohan Lal: ‘జల్లికట్టు’ దర్శకుడితో కంప్లీట్ యాక్టర్ కొత్త సినిమా…