హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో అదే విధంగా రేపు కూడా పని చేస్తాం.. తెలంగాణలో ఆశించిన మార్పుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. పదవులు తమ సొంతానికి ఉపయోగించుకోవడానికి కాదు.. తెలంగాణ జన సమితి నాయకులు చేసిన సేవకు ఫలితంగానే ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది అని కోదండరాం పేర్కొన్నారు.
Read Also: Minister Seethakka: విద్యుత్ షాక్ తో ముగ్గురి మృతి.. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీతక్క
ఈ రాజ్యాంగం పనికి రాదు అని కొందరు అనుకుంటున్నారు.. కొత్త రాజ్యాంగం రాసుకోవాలని చూసున్నారు అని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఏ విలువల కోసం పోరాటం చేశామో అవి రాజ్యాంగంలో పొందుపరిచారు. బ్రిటీష్ పాలకులను ఎదిరించిన ప్రతీక రాజ్యాంగం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అందరం సమానమని భావించాం.. అసమానతలు పోయి సమానత్వంతో అందరూ బ్రతకాలి అని రాజ్యాంగం రాసుకున్నాం.. సమాన అవకాశాలు, హక్కులు ఉండాలని రాజ్యాంగం సూచిస్తుంది. ప్రభుత్వం పూనుకొని సమాన, ఆర్థిక అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం ప్రకటించింది అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చాలా మంది రాజ్యాంగం మార్చాలని అనొచ్చు.. కేసీఆర్ కూడా రాజ్యాంగం మార్చాలని అన్నారు. చైనా, సింగపూర్‌లో ఉన్న నియంతృత్వ పాలన ఉండాలని చూస్తున్నారు.. అందరం దేవుడ్ని మొక్కుతాం.. సమాజ మార్పు దానంతట అదే జరుగుతుంది అనుకుంటే జరగదు.. గద్దర్ చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వస్తే పూర్తి సమానత్వం వచ్చినట్లు అన్నారు అనే విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు.