ప్రియాంక సింగ్ పెరుగు తెలియని వాళ్లు ఉండరు.. మొదట జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తూ సాయిగా బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత లింగ మార్పుడి చేసుకొని ప్రియాంక సింగ్ గా మారింది.. అచ్చం అమ్మాయి పోలికలతో ఎంతో అందంగా తయారయ్యారు. ఈ క్రమంలోనే తను బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.. బిగ్ బాస్ లో తన అంద చందాలతో అందరిని కట్టి పడేసింది ప్రియాంక.. ఆ తర్వాత సీరియల్ నటుడు మానస్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు అందరిని నమ్మించింది..
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అందరిని సందడి చేసినటువంటి ప్రియాంక ప్రస్తుతం ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. బుల్లితెరపై ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నటువంటి సమయంలో ఈమె కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు.. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రియాంక ఒక వీడియోను షేర్ చేసింది..
కొత్త కారును కొన్నట్లు చెప్తుంది.. ఈ వీడియోలో ఈమె హుంద్యాయ్ షో రూమ్ లోకి వెళ్లి కారుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా పూర్తిచేసి కొత్త కారును అందరికీ చూపించారు. ఈమె హుంద్యాయ్ వెర్న్ ఎస్ ఎక్స్కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు ప్రియాంక పూజలు చేసి అనంతరం కారులో డ్రైవ్ చేస్తూ వెళ్లారు ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ఈమె 13 సంవత్సరాల తన కల కష్టం నేటితో నెరవేరింది అంటూ ఎమోషనల్ అవుతుంది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..