Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు చేపట్టింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం పదవికి నేతల మద్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. అయితే హిమాచల్ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కి కాంగ్రెస్ అధిష్టానం.. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. సీఎం ఎవరనేది శనివారం ప్రియాంక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేసులో ప్రతిభా సింగ్, ముఖేష్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సింగ్ సుఖుల ఉన్నారు. అయితే తాను సీఎం రేసులో ఉన్నట్టు జరుగుతున్న ఊహాగానాలను సుఖ్ విందర్ తోసిపుచ్చారు. తాను ఎప్పడూ కాంగ్రెస్ కార్యకర్తను అని .. పార్టీ తనకు చాలా ఇచ్చిందని.. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
Read Also: Puri Jagannadh: పూరి జగన్నాథ్ జీవితంలో సగం రోజులు గొడవలేనట
మరో వైపు సీఎం ఎంపికకు హైకమాండ్ తరపున పరిశీలకులుగా వచ్చిన చత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ భఘేల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం పార్టీ నాయకులతో మరోసాని సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం పీఠం కోసం పోటీ పడుతున్న పీసీసీ అధ్యక్షరాలు ప్రతిభా సింగ్, ముఖేష్ అగ్నిహోత్రి, వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య పాల్గొన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి పదవిని తాను ఆశిస్తున్నట్టు ప్రతిభా సింగ్ ప్రకటించగా.. మరో వైపు వీరభద్రసింగ్ కుటుంబానికే పదవి ఇవ్వాల్సిందిగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంతో సీఎం పదవి ఎవరిని వరించనుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.