సుఖ్వీందర్ సింగ్‌ది మొదట్లో సాధారణ జీవనమే. ఆయన తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేశారు. సుఖు కూడా ఒకప్పుడు పాలు విక్రయించారు. పాలు విక్రయించిన సుఖ్వీందర్.. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు చేపట్టింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం పదవికి నేతల మద్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు.
హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిమాచల్‌లో 68 సీట్లలో 40 గెలిచిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.