Priyanka Gandhi: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంట్లో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా మధ్యప్రదేశ్ వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. వేదికపై ఓ కాంగ్రెస్ నేత చేసిన పనికి తనకు నవ్వు ఆగలేదు. ప్రియాంక గాంధీ నవ్వడంతో వేదికపై ఉన్న మిగతా నేతలతో పాటు ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వేదికపైకి రాగానే ప్రియాంక గాంధీకి ఆ పార్టీకి చెందిన స్థానిక నేత దేవేంద్ర యాదవ్ బొకే అందించారు. ప్రియాంక అందుకోగానే గుత్తిలో పూలు లేకపోవడం చూసి నవ్వుకుంది.
Read Also:pregnant woman: నిండు గర్భిణిని అంబులెన్స్ లేక 5కి.మీ దూరం మోసుకెళ్లిన బంధువులు.. కానీ అప్పటికే
ఖాళీగా ఉన్న పుష్పగుచ్ఛాన్ని చూసి ఇతర నేతలు ఆశ్చర్యపోయి నవ్వుకున్నారు. అనంతరం సభలో ప్రసంగించిన ప్రియాంక మధ్యలో పుష్పగుచ్ఛం గురించి ప్రస్తావించారు. తాను ఇంతకుముందే ఓ బొకే అందుకున్నానని చెప్పారు. అది అచ్చంగా బీజేపీ లీడర్లు ఇస్తున్న హామీల్లాగే… బొకే కూడా ఖాళీగా ఉందని చెప్పడంతో జనం విరగబడి నవ్వారు. ఇండోర్ సభలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేయడంతో అది తెగ వైరల్ గా మారింది.
Read Also:YV Subba Reddy: ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ గెలుపును ఎవరు ఆపలేరు..
गुलदस्ता घोटाला 😜
गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂
मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94— राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023