Odisha: పెరిగిన విజ్ఞానంతో మనిషి అంతరిక్షానికి సైతం వెళ్లి వస్తున్న ఈ కాలంలో కొంత మంది ప్రజలు మాత్రం ఊరి పొలిమేర దాటడానికి కూడా అవస్థలు పడుతున్నారు. దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్ళాలి అనుకున్న కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా సైరైన రహదారి లేక కొన్ని సందర్భాల్లో రోగిని, గర్భిణీలను డోలిలో ఆసుపత్రికి మోసుకెళ్లిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఒడిస్సాలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. ఒడిస్సా రాష్ట్రం లోని, కలహండి జిల్లా జయపట్న బ్లాక్ లోని ధన్సులి పంచాయతీ నలచువాన్ గ్రామానికి చెందిన శుక్రి జానీ (30) అనే గర్భిణీకి సోమవారం ఉదయం 7 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. దీనితో గ్రామస్థులు జన్నీ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో గర్భిణీ కోసం వచ్చిన అంబులెన్స్ గ్రామం లోకి వెళ్లేందుకు రహదారి లేకపోవడం వల్ల గ్రామానికి 5 కిలోమీటర్ల దూరం లోని బంగ్తిసహాజ్ గ్రామంలో నిలిచి పోయింది.
Read also:YV Subba Reddy: ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ గెలుపును ఎవరు ఆపలేరు..
ఈ క్రమంలో చేసేదేమిలేక శుక్రి భర్త సీతారాం గ్రామస్థులతో కలిసి శుక్రిని మంచం మీద ఎక్కించుకుని అంబులెన్సు వరకు తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. కాగా శుక్రీ మార్గమధ్యం లోనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ తరువాత తల్లీ బిడ్డను జన్ని సెక్యూరిటీ లేన్ కిందకు తీసుకొచ్చిన జైపట్న కమ్యూనిటీ తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు మాట్లాడుతూ జయపట్న బ్లాక్‌లో గత కొంత కాలంగా వివిధ పథకాలకు లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకవర్గం ఈ ప్రాంతం అభివృద్ధికి మంజూరు చేసిన నగదును కాజేసి ప్రజలను సమస్యలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.