టాలీవుడ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు .మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి పేరు తెచ్చి పెట్టింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .బలగం సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో ప్రియదర్శికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే .ఆ గొడవ అంత వారి అప్ కమింగ్ మూవీ ప్రమోషన్స్ కోసమే అని తెలిసిపోయింది.హీరో ప్రియదర్శి ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రధాన పాత్రల్లో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది .
ఈ సినిమాకు ‘డార్లింగ్’ అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు. ‘వై దిస్ కొలవెరి’ అంటూ ట్యాగ్ లైన్ ను ఉంచారు.తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా సెన్సషనల్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ని అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కు చెందిన నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వివేక్ సాగర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నారు . ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు .ఈ సినిమా టీజర్ చూస్తే ఇందులో భార్య భర్తల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ప్రభాస్ సూపర్ హిట్ మూవీ “డార్లింగ్” టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ప్రియదర్శికి మరో హిట్ అందిస్తుందో లేదో చూడాలి .