Modi Telangana Tour: ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో తెలంగాణలో పర్యటించనున్నారు. వచ్చే నెల 8న ప్రధాని వరంగల్ కు రానున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. వరంగల్ టూర్ లో భాగంగా.. అధికార కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతలను ఆదేశించారు. దీంతో కార్యకర్తలు, నేతలు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Morning sickness: గర్భధారణ సమయంలో అరుదైన ఆరోగ్య పరిస్థితి.. దంతాలన్నింటిని కోల్పోయిన మహిళ
అటు హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మీటింగ్ వాయిందా పడింది. జులై 8వ తేదీన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉందనుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు ప్రధాని వరంగల్ పర్యన సందర్భంగా వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ మీటింగ్ కు సంబంధించి ఎప్పుడు, ఎక్కడా నిర్వహిస్తారని ఎలాంటి సమాచారం లేదు. అంతకుముందు ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీకి సంబంధించి పలు విషయాలను చర్చిస్తామని తెలిపారు.
Read Also: SS Rajamouli: ఆర్ఆర్ఆర్ టీమ్లో ఆరుగురికి ఆస్కార్ ఆహ్వానం.. జక్కన్న రియాక్షన్ ఇదే!
మరోవైపు బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్రానికి రావల్సిన షెడ్యూల్ కూడా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలు చేపడతారని అనుకున్నారు. ఇప్పటికే భోపాల్‌లో జరిగిన ‘మేరా పోలింగ్ బూత్… సబ్‌సే మజ్బూత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు తాజా షెడ్యూల్ తో వారి పర్యటన కూడా వాయిదా పడొచ్చని బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి.