SS Rajamouli: ఆర్ఆర్ఆర్ టీమ్లో ఆరుగురికి ఆస్కార్ ఆహ్వానం.. జక్కన్న రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli Response on RRR Team invited to Oscars : ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందిన `ఆర్ఆర్ఆర్` సినిమా యూనిట్ కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా యూనిట్ లోని ఆరుగురికి ఏకంగా ఆస్కార్ కమిటీలో అవకాశం లభించింది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల ప్యానల్ కమిటీ సభ్యులుగా `ఆర్ఆర్ఆర్` చిత్రానికి చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించగా అందులో ‘ఆర్ఆర్ఆర్` టీమ్‌కు చెందిన ఆరుగురు ఉన్నారు.
Comedian Satya: ‘రంగబలి’ కోసం ‘సత్యబలి’.. వాళ్లలో ఎవరినీ వదల లేదుగా!
Also Read
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రఫర్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్ ఉన్నారు. ఈ క్రమంలో దీంతో సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయం మీద రాజమౌళి స్పందిస్తూ ఈ సంవత్సరం అకాడమీ అవార్డుల కోసం మా ఆర్ఆర్ఆర్ బృందంలోని 6 మంది సభ్యులు సభ్యులుగా ఆహ్వానించబడినందుకు చాలా గర్వంగా ఉంది, తారక్, చరణ్, పెద్దన్న, సాబు సర్, సెంథిల్ & చంద్రబోస్ గారూ అభినందనలు, అలాగే, ఈ సంవత్సరం ఆహ్వానం అందుకున్న భారతీయ సినిమా సభ్యులకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఇండియా నుంచి వీరికి మాత్రమే కాక మరికొందరికి కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది. తమిళ `డైరెక్టర్ మణిరత్నం, కరణ్ జోహార్ కు కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది. అయితే వారితో పాటు దర్శక ధీరుడు రాజమౌళికి కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!