Tabu: కూలీ నెం 1 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ టబు. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నటబు.. ఆ తరువాత ననాగార్జున సరసన నిన్నే పెళ్లాడతా సినిమాలో నటించి తెలుగువారికి దగ్గరయింది. ఇక ఈ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. ఇక నాగ్ తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహం కన్నా ఎక్కువైన బంధం.. ఆమె ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా నాగ్ ఇంట్లోనే ఉంటుంది అంటే వారి అనుబంధం అంత ప్రత్యేకం. ఇక ఇప్పటివరకు టబు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆమె పెళ్లిచేసుకోకపోవడానికి కారణాలు ఏవైనా.. దాని గురించి టబు నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటుంది. ప్రస్తుతం టబు వయస్సు 51.
Rukmini Vasanth: టాలీవుడ్ లో గట్టిగా వినిపించే పేరు అవుతుంది..
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస సినిమాలతో ఖాళీ లేకుండా ఉన్న టబు.. ఈ వయస్సులో కూడా అంతే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టబు.. ఈ మధ్య షేర్ చేసిన ఫొటోల్లో అదిరిపోయింది. నెటెడ్ టీ షర్ట్ లో యమా హాట్ గా కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ వయస్సులో కూడా ఇంత హాట్ గా కనిపించడం అందరి వలన కాదని చెప్పుకొస్తున్నారు. ఎంతైనా నా హీరోయిన్ కదా.. ఆ మాత్రం హాట్ ఉండాలి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం టబు కుఫియా అనే సిరీస్ లో నటిస్తోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో టబు ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.