న్యూయర్ రోజు తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని అందరు అనుకుంటారు.. పాత సంవత్సరాన్ని పంపించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చాలా మంది అనుకుంటారు.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్‌లో వేడుకలు జరిగాయో అర్థమవుతోంది.. భారీగా చికెన్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. ఎప్పటి లాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి.…
Haliya: తల్లిని మించిన దైవం లేదు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంత బాధనైనా భరిస్తూ మనకు జన్మనిస్తుంది. మనకు కష్టమొచ్చిందంటే తల్లిపేగు విలవిలలాడిపోతుంది.
‘అమ్మను మించిన దైవం లేదు’ అన్నది ఆర్యోక్తి! అదే పంథాలోనే ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు సాగుతూ ఉన్నారు. కళారంగం మరింతగా స్త్రీశక్తికి పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా అమ్మను ఆదిశక్తిగా, ఆరాధ్యదేవతగా కొలుస్తూ ఉంటుంది. సకల కళలకు నెలవైన సినిమా రంగం మరింతగా ‘అమ్మ’ను ఆరాధిస్తుంది. అమ్మ అనురాగం నేపథ్యంలో రూపొందిన అనేక చిత్రాలు భారతదేశంలో ఘనవిజయం సాధించాయి. నాటి ‘ఔరత్’ మొదలు నేటి ‘ఛత్రపతి’ దాకా ఎన్నో హిందీ చిత్రాలలో ‘మదర్ సెంటిమెంట్’ చోటు చేసుకొని జనాన్ని…
మదర్స్ డే రోజు మన అమ్మగారికి శుభాకాంక్షలు చెప్పడం.. కానుకలు కొనివ్వడం ఇవన్నీ కామనే.. అయితే ఓ పంజాబీ మదర్ మాత్రం తనకు బిడ్డల నుంచి ఎలాంటి గిఫ్ట్ కావాలని ఆశిస్తోందో చెప్పిన తీరు ఫన్నీగా అనిపించినా అందర్నీ చాలా ఆలోచింపచేస్తోంది.
దేశంలో ప్రతి సంవత్సరం అందరం మాతృ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటామో.. అలాగే భార్య దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని అన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భార్య దినోత్సం గురించి ప్రస్తావిస్తూ.. భార్యా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన వెల్లడించారు. తల్లి జన్మనిస్తున్న కారణంగా మాతృ దినోత్సవాన్ని…
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటారు. ఆయన దాతృత్వ గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో సాయం కోరిన వారికి, తమ ప్రతిభతో ఆకట్టుకునేవారి పట్ల ఆయనెంతో ఉదారంగా వ్యవహరిస్తుంటారు. తనవంతు సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఒక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో రూపాయికే 4 ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న కమలాత్తాళ్ కు ఆయన…
‘మదర్స్ డే’ని పురష్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి భూమ్మీద ఉండే అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తన తల్లి అంజనా దేవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో కలిసి ఉన్న ఒక వీడియోని షేర్ చేశారు. గతంలో ఓసారి గాడ్‌ఫాదర్, భీమ్లా నాయక్ చిత్రీకరణలు ఒకేసారి జరిగాయి. ఆ సమయంలో అంజనా దేవి, నాగబాబు లొకేషన్‌కు చేరుకొని.. సెట్‌లో కాసేపు గడిపారు. అందరూ కలిసి సెట్‌లోనే భోజనం చేశారు. చూడ్డానికి ఎంతో చూడమచ్చటగా ఉండే ఈ వీడియోను అందరినీ…
తెలుగు ఇండియన్ ఐడిల్ 20 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ వారాంతంలో మదర్స్ డే ను పురస్కరించుకుని మెలోడీ బ్రహ్మ మణిశర్మను అతిథిగా ఆహ్వానించి, ఫ్యామిలీ స్పెషల్ ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. తెలుగు ఇండియన్ ఐడిల్ జడ్జీల్లో ఒకరైన నిత్యా మీనన్ తనదైన శైలిలో మణిశర్మను ఈ ప్రోగ్రామ్ కు ఆహ్వానించగా, మిగిలిన ఇద్దరు న్యాయ నిర్ణేతలు తమన్, కార్తీక్ మణిశర్మతో పాటు కలిసి పాటకు స్టెప్పులేశారు. మణిశర్మ గెస్ట్ గా స్టేజ్ మీదకు…
హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒకవైపు మదర్స్ డే వేడుకలకు ప్రపంచం సిద్ధం అవుతోంది. అయితే హైదరాబాద్ లో ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య,భూదేవి (58)అలియాస్ లక్ష్మి దంపతులు దిల్ సుక్ నగర్ న్యూ గడ్డి అన్నారం కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు. అతని వయసు 27 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి జంగయ్య కింద గ్రౌండ్ ఫ్లోర్…