ఈసారి ఆగస్టు 15వ తేదీ గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎర్రకోటపై నుంచి వరుసగా 11 సార్లు ప్రసంగం చేసిన దేశానికి మూడో ప్రధానిగా రికార్డులకెక్కనున్నారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఈ ఘనత సాధించారు. బీజేపీ ముడో సారి అధికారంలోకి రావడంతో నెహ్రూ మూడు పర్యాయాలు సాధించిన రికార్డును సమం చేశారు.
READ MORE: Ambati Rambabu: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడాన్ని జగన్ అకౌంట్‌లో వేయడం దారుణం
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుసగా 17 సార్లు ప్రసంగించారు. కాగా.. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు.. మళ్లీ జనవరి 1980 నుంచి అక్టోబర్ 1984 వరకు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ 16 సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇందిరా గాంధీ ప్రసంగాలలో 11 వరుసగా ఉన్నాయి.
READ MORE:Anchor Soumya Rao: జబర్దస్త్ షో నుంచి అందుకే వెళ్ళిపోయ యాంకర్ సౌమ్యరావ్
ఈసారి గురువారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని. తన హయాంలో పదిసార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను రికార్డును బద్దలు గొట్టనున్నారు. మోడీ 2014లో తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్వచ్ఛ భారత్.. జన్ ధన్ ఖాతాల వంటి పెద్ద పథకాలను ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాల సగటు వ్యవధి 82 నిమిషాలు. ఇది భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి చేయనంత ఎక్కువ. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ 71 నిమిషాల సగటుతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ సంఖ్య 1997లో ఆయన ఇచ్చిన ఏకైక ప్రసంగం ఆధారంగా రూపొందించబడింది.