Anchor Soumya Rao: జబర్దస్త్ షో నుంచి అందుకే వెళ్ళిపోయా: యాంకర్ సౌమ్యరావ్
- ఒక్కసారిగా జబర్దస్త్ షో నుంచి కనిపించకుండా యాంకర్ సౌమ్యరావ్
- వాళ్లు తీసేశారా మీరు వెళ్లిపోయారా అన్న ప్రశ్న
- జీవితంలో ఒక కంపెనీపై ఒకరిపై ఎపుడు ఆధారపడకూడదు
- ఆ దారిని ఎప్పుడు ఎవరు ఎలా క్లోజ్ చేస్తారో మనకు తెలియదు
- హోస్టుగా రాణించాలంటే గ్లామర్ అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soumya Rao’s Statement on Leaving Jabardasth: ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరపై కామెడీతో అలరిస్తూ, కితకితలు పెట్టిస్తోన్న షో జబర్దస్త్. ఈ షోతో ఎంతో మంది కెరీర్ స్టార్ట్ చేసి ఈనాడు వెండితెరపై తమ సత్తాను చాటుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆదితో సహా పలువురు కమెడియన్స్ బిగ్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. అలాగే ఇందులో మొదట యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ సైతం బిజీగా మారిపోయింది. వరుసగా సినిమా ఆఫర్లు రావడం వలన ఈ షో నుండి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాని తరువాత ఆమె యాంకర్ ప్లేసు రీప్లేస్ చేస్తూ కన్నడ సీరియల్ నటి అయిన సౌమ్యరావ్ ఎంట్రీ ఇచింది. ఆమెకి తెలుగులో మాట్లాడటం కష్టం అయినప్పటికీ తన టైమింగ్ తో చాలా చక్కగా యాంకరింగ్ చేస్తూ తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎన్నో సంవత్సరాలు యాంకర్ చేస్తుంది అనుకున్న ఆమె ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా జబర్దస్త్ షో నుంచి కనిపించకుండా పోయింది.
Also Read: Pawan Kalyan: భారత అంతరిక్ష రంగ పితామహుడి జీవితం స్ఫూర్తిదాయకం
Also Read
- Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
- Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
అయితే చాలా మందికి సౌమ్య రావ్ ఎందుకు వెళ్లిపోయిందో తెలియలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకుంది ఆమె. జబర్దస్త్ నుండి సడెన్‌గా కనుమరుగవ్వడంతో వాళ్లు తీసేశారా, మీరు వెళ్లిపోయారా అన్న ప్రశ్న ఎదురు కాగా, ఆ షో లో అగ్రిమెంట్ అయిపోయింది అందుకే క్విట్ అయ్యానని చెప్పింది. ‘వన్ ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పారు.. నెక్ట్స్ ఇయర్ కొత్త ఫేస్ ట్రైం చేస్తాం అన్నారు. ఇట్స్ ఓకే అని చెప్పా. అక్కడ ఉన్నప్పుడు మంచిగానే చూసుకున్నారు. బెంగళూరు నుండి ఇక్కడకు తీసుకు వచ్చి, క్యాబ్ వంటి సౌకర్యాలిచ్చారు. పేమెంట్స్ ఇష్యూస్ కానీ, కంటెస్టెంట్ల నుండి కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు. టీమ్ లీడర్స్, జడ్జస్, ప్రొడక్షన్ టీం, మేనేజ్ మెంట్ బాగా చూసుకున్నారు’ అని పేర్కొంది.
కానీ యాంకరింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్ చేయడం వదులుకున్నాను. మళ్లీ మంచి ఆఫర్స్ వస్తే వెళతాను. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే..? జీవితంలో ఒక కంపెనీపై, ఒకరిపై ఎపుడు ఆధారపడకూడదు. ఒక ఆర్టిస్టుగా మన మార్గాలను మనమే వెతుక్కోవాలి. ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో ఆ దారుల్లో వెళ్లిపోవాలి. ఈ దారి బాగుంది.. ఇందులోనే వెళ్లాలని ఓ ఆర్టిస్టు అనుకోకూడదు. ఆ దారిని ఎప్పుడు, ఎవరు, ఎలా క్లోజ్ చేస్తారో మనకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చింది. హోస్టుగా రాణించాలంటే గ్లామర్ అవసరం లేదని, మంచిగా మాట్లాడాలి, టైమింగ్ బాగుండాలి, అట్ట్రాక్ట్ చేయగలగాలి’ అని చెప్పింది.
Also Read: Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
ఇక్కడ ఇండస్ట్రీ కి కన్నడ ఇండస్ట్రీ కి ఏమైనా తేడాలు కనిపించాయా అని అడగగా కన్నడ ఇండస్ట్రీ లో తనకు ఎదురైనా ఒక చేదు సంగటన చెప్పుకొచ్చింది. సీరియల్ లో సైడ్ క్యారెక్టర్ చేసే రోజుల్లో ఒకరోజు ప్రొడక్షన్ హౌస్ లో భోజనం చేయడానికి వెళ్ళినపుడు అనుకోకుండా ఒక బాక్స్ లో స్వీట్ వేసుకున్న అని దానివల్ల కొంతమంది తనని దరిద్రపుదాన హీరోయిన్ కోసం తెచ్చిన బాక్స్ ఎందుకు ముట్టుకున్నావు ఎవరు పడితే వారి తినడానికి కాదు ఇది హీరోయిన్ గారి కోసం నీకు కళ్ళు కనపడటం లేదా అక్కడ బాయ్స్ వడ్డిస్తున్నరు కదా అక్కడకి వెళ్లి తిను అంటు చాలా చులకనగ చేసి మాట్లాడారు అని చెప్పుకొచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో చాలా బాగా చూసుకున్నారు అని ప్రస్తుతం కిరాక్ బాయ్స్, కిలాడీ లేడీస్ షోలో చేస్తున్న ఇంక ఏమైనా మంచి ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!