తాడికొండలో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ,పీ అనే రెండు ప్రాథమిక సూత్రాలతో సంక్షేమాన్ని కలుపుకొని సమగ్రసర్వార్థక అభివృద్ధికి పూల బాట పట్టారని తెలిపారు. ఇక ఇందులో భాగంగా ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Also read: Iron Dome-Arrow System: ఇరాన్ దాడిని తిప్పికొట్టిన ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలు ఇవే.. ఎలా పనిచేశాయంటే.?
ఇక చంద్రబాబు నాయుడు హయాంలో 30 వేల ఎకరాలకు పైగా ఎకరాలను రాజధాని కోసం సమకూర్చారని., మీరు కేవలం మూడు ఎకరాలైన సేకరించగలరా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో ఎన్నో పనులకు సంబంధించిన పనులను అలాగే వదిలేసాడని ఇక్కడ పనిచేస్తున్న అనేకమంది వారి పొట్ట కొట్టాడంటూ ఆయన పేర్కొన్నాడు.
Also read:Honey Rose : వైట్ శారీలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న హనీ రోజ్..
ఇక ప్రత్తిపాడులో చంద్రబాబు నాయుడుకి జనం నీరాజనం పలికారు. హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ర్యాలీగా వెళ్లారు. ఇదే సభలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కూడా పెద్ద జెండాలను పట్టుకుని సభకు హాజరై వారి మద్దతును కూడా పలికారు. ఈ సభలో ఎమ్మార్పీఎస్ వారిని ఉద్దేశిస్తూ వర్గీకరణకు మద్దతు తెలియజేసింది నేనే అంటూ బాబు పేర్కొన్నారు.