Movie Review: కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సందడి వాతావరణం కనిపించేది. కానీ ట్రెండ్ మారింది ప్రసాద్ మల్టిప్లెక్స్ ముందు ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ చానళ్ల హవా పెరిగింది. ఈ చానళ్లంతా సినిమా రిలీజ్ తర్వాత పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి పోటీపడుతున్నాయి. కాస్తంత ఫిలిం నాలెడ్జ్ ఉంటే సరి.. ఎవరైనా సింపుల్‌గా ఒక యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేస్తున్నారు. షో ముగిసిన వెంటనే ఓ మైక్ పట్టుకుని సినిమా చూసిన ప్రేక్షకులను దానిపై అభిప్రాయం అడుగుతున్నారు. రెగ్యులర్ రివ్యూయర్స్ కూడా ఎక్కువయ్యారు. ఈ ట్రెండ్‌కు ప్రసాద్ మల్టిప్లెక్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కానీ ఇకపై అలాంటి రివ్యూలు కనిపించవు. మల్టిప్లెక్స్ ఆవరణలో ఇలాంటి రివ్యూలను నిషేధం విధిస్తూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓ పెద్ద సినిమా రిలీజ్ రోజు జరిగిన సంఘటనే అందుకు కారణమని భావిస్తున్నారు.
Read Also:Vladimir Putin: ప్రధాని మోడీని అభినందించిన పుతిన్.. ఎందుకో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న రిలీజైంది. ఇదే రోజు ఒక యూట్యూబర్‌పై ప్రభాస్ అభిమానులు దాడి చేశారు. ఏ సినిమా విడుదలైనా మొదటి రోజున తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో చెప్పే యువకుడు ‘ఆదిపురుష్’ చిత్రంపైనా తన ఒపీనియన్ చెప్పాడు. అయితే సినిమా నెగెటివ్‌గా ఉందని చెప్పడం జీర్ణించుకోలేని ప్రభాస్ ఫ్యాన్స్.. ఆ యువకుడిని చితకబాదారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మల్టిప్లెక్స్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే. వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించే చిత్రాలపై రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తుంటాయి. అలాంటి చిత్రాలకు ఫస్ట్ రోజే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం సబబు కాదు. ఈ దిశగా మల్టిప్లెక్స్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం ఉపయోగపడొచ్చు. కానీ యూట్యూబ్ చానళ్లు నడుపుతున్న వారికి మాత్రం ఇబ్బందే.
Read Also:WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఒకేసారి 32 మందికి వీడియో కాల్ చేయొచ్చు