Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి. మరి ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆయన ఏ సినిమా రీ రిలీజ్ కాబోతోంది..? మరి ఏ తేదీన మళ్లీ విడుదల చేస్తారనే వివరాలు తెలుసుకుందాం. కొన్నాళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో అసిన్, ఛార్మి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న రీ-రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
Read Also:Road Accidents: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది దుర్మరణం
రెబల్ స్టార్ ప్రభాస్ కొన్నాళ్ల క్రితం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్, తాప్సీ కథానాయికలుగా నటించగా, దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబరు 22న సినిమాను మళ్లీ విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్లింగ్ చిత్రాన్ని అక్టోబర్ 23న రీ-రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read Also:LPG Cylinder : పండుగలకు ముందు సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా విడుదలైంది. ప్రభాస్ నటించిన ఈ నాలుగు సినిమాలను ఈ అక్టోబర్‌లో మళ్లీ విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. మరి ఈ జాబితాలోకి ఇంకెన్ని సినిమాలు చేరుతాయో చూద్దాం.