ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ అది నిజం కాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. ఇక ముందు సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ డేట్ కి కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి సీక్వెల్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.
Rashmika: ఆ పనిలో బిజీగా రష్మిక
రాజా సాబ్ క్లైమాక్స్లో ఆ సినిమాకి సంబంధించిన లీడ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్ మాత్రమే సలార్, కల్కి సహా ఇప్పుడు రాజా సాబ్ తో మూడు సీక్వెల్స్ ఉన్న హీరోగా అవతరించాడు. అయితే ఇప్పటికే ఆయన వేరే సినిమాలకు కూడా డేట్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ సీక్వెల్స్ పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయమే పట్టొచ్చు. రాజా సబ్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 500 కోట్లు ఈ సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మారుతి డైరెక్షన్ చేస్తున్నాడు.