వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ స్ట్రీక్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన తన తరువాతి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. చావాలో ఆమె నటించిన యేసు భాయి రోల్ కి మంచి ప్రాధాన్యత ఉండటంతో పాటు ఆమె పద్ధతిగా కనిపించింది అనే పేరు రావడంతో ఆమెకు మరిన్ని సినిమాలు క్యూ కడుతున్నాయి. అంతకుముందే ఆమె చేసిన పుష్ప సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే జిమ్ లో ఆమె కాలికి గాయం కావడంతో ఆమె చేస్తున్న బడా చిత్రాలన్నింటికీ బ్రేకులు పడ్డాయి. అయితే ఆమె చేస్తున్న మరో బడా చిత్రం సికిందర్ రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
NTR Neel: ప్రశాంత్ నీల్ డ్యూటీ ఎక్కేశాడు!
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. మురుగదాస్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో రీ జాయిన్ అయి తన పార్ట్ పూర్తి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరొకపక్క కుబేరలో ఆమె చేయాల్సిన పోర్షన్ కోసం శేఖర్ కమ్ముల ఎదురు చూస్తున్నాడు. రష్మిక కాలి గాయం కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోని ఈ సినిమాకి సంబంధించిన షూట్ వాయిదా పడింది. షూట్ తో పాటు రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక తన పోర్షన్స్ పూర్తి చేసి వీలైనంత త్వరగా మేకర్స్ కి రిలీజ్ అడ్డంకులు తొలగించేందుకు రష్మిక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.