Funny Thief in Siddipet: చైన్ స్నాచింగ్ లు, డ్రగ్స్ స్మగ్లింగ్ , అక్రమ ఆయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దొంగతనాలు చేస్తూ కొందరు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటివి చేస్తూ.. పోలీసుల కళ్లుకప్పి తప్పించుకున్నా ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేసి బుక్కవ్వాల్సిందే. తాజాగా సిద్దిపేటలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.
Read also: Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..
ఒక వ్యక్తి అనారోగ్యంతో సిద్దిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అంతే తన దొంగతన బుధ్దిని చూపించుకున్నాడు. ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్‌ను దొంగ చూశాడు. ఇంకేముంది చేయి చూపించి.. మెల్లిగా అంబులెన్స్ తో అక్కడి నుంచి బయలుదేరాడు. అంబులెన్స్‌ని దొంగిలించి, అమ్మి వచ్చిన డబ్బుతో ఆనందంగా ఎంజాయ్ చేయబోయాడు.కానీ పేదరికం వెంటాడింది. హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఇక్కడే ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. దొంగ ఎక్కడి నుంచి వచ్చాడో అంబులెన్స్ ఎక్కించి.. తిరిగి అదే ఆస్పత్రికి వచ్చాడు. పేషెంట్‌గా చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: BSNL Services: ప్రజలకు బిఎస్ఎన్ఎల్ సేవలు.. ఉద్యోగుల అవగాహన ర్యాలీ..
మద్దూరు మండలం రేపర్తి గ్రామానికి చెందిన వల్లెపు అశోక్ అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రి ముందు ఆగి ఉన్న అంబులెన్స్ ను దొంగిలించాడు. అక్కడి నుంచి పరిపోయేందుకు. ఓ రేంజ్ లో అంబులెన్స్ ను స్పీడ్ గా నడిపాడు. అంతలోనే తను కళ్లు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు. ప్రమాదం జరగడంతో స్థానికులు సిద్దిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ దొంగ చేసిన దొంగతనం తెలిసి ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ఉపయోగపడే అంబులెన్స్‌ను దొంగిలించినందుకు దొంగకు తగిన శాస్తి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Nagarjuna Sagar: సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. చూసేందుకు పర్యాటకుల సందడి..