Nijam With Smitha:ప్రేక్షకులు ఎప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలలో, టాక్ షోలలో తారలు తమ నిజ జీవితాల గురించి, స్టార్లుగా అవ్వకముందు ఎలా ఉండేవారు అనేదాని గురించి, స్టార్లుగా మారడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాల గురించి చెప్తూ ఉంటారు. అందుకే ఎక్కువ బుల్లితెరలపై వచ్చే టాక్ షోలు ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇక కొన్ని టాక్ షోలలో నిజం నిర్భయంగా చెప్పడానికే ఇష్టపడతారు సెలబ్రిటీలు. అలాంటివాటిపైనే అభిమానులు మక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో పైన కనిపించే మెరుగులే కాదు లోపల ఉన్న చీకటి కోణాలను కూడా నిర్భయంగా బయటపెడతానంటుంది సింగర్ స్మిత. మసక మసక చీకటిలో.. అంటూ మైక్ పట్టుకొని స్మిత పాడితే.. మాయదారి చిన్నోళ్లందరూ ఆమె వెంటనే పడ్డారు. హస్కీ వాయిస్ తో మత్తెక్కించే ఎన్నో పాటలను పాడిన స్మిత తాజాగా ఒక టాక్ షో కోసం హోస్ట్ గా మారిపోయింది. సోనీలివ్స్ కోసం ఆమె ‘నిజం నిర్భయంగా’ అనే టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రముఖ సినీ, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. చిరంజీవి దగ్గర నుంచి నారా చంద్రబాబు వరకు.. నాని దగ్గరనుంచి సాయి పల్లవి వరకుఈ టాక్ షోలో పాల్గొని నిజాన్ని నిర్భయంగా బయటపెట్టినట్లు ప్రోమోలో తెలుస్తోంది.
Project K: ఓరి బాబో ఆపండ్రా .. ఇక్కడ ఒక్కటే అవ్వలేదు అప్పుడే రెండోదా..?
ముఖ్యంగా చంద్రబాబు.. కేసీఆర్ గురించి మాట్లాడడం, చిరంజీవి కులం గురించి, నాని నెపోటిజం గురించి, సాయి పల్లవి వేధింపుల గురించి మాట్లాడి షాక్ ఇచ్చారు. ఒక చిన్న ప్రోమోతో షో పై ఆసక్తిని పెంచేశారు. ఇందులో సెలబ్రిటీలు మాట్లాడిన ప్రతి మాట ఒక సెన్సేషన్ అని చెప్పాలి. దీంతో పేరుకు తగ్గట్టే స్మిత.. టాలీవుడ్ చీకటి కోణాన్ని బయటపెడుతుందా..? ఇండస్ట్రీలో అసలు జరుగుతున్నది ఏంటి..? ఎవరు.. ఎవరిని వేధిస్తున్నారు.. అసలు ఇండస్ట్రీకి వచ్చేముందు ఒక నటుడిగా వారు ఏం ఆలోచిస్తారు..? ఇలాంటి వాటి గురించి స్మిత డేర్ గా ప్రశ్నలు అడుగుతూ కనిపించింది. మరి ఈ షో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూడాలంటే.. సోనీలివ్ లో ఫిబ్రవరి 10 నుంచి ప్రసారమయ్యే నిజం నిర్భయంగా టాక్ షో ను చూడాల్సిందే.