Poonam Pandey : ఎప్పటికప్పుడు వివాదాస్పద చేష్టలతో వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తుంటారు పూనమ్ పాండే. 2011 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయం సాధిస్తే తన దుస్తులు విప్పేస్తానంటూ ఒక ప్రకటన చేసి పెద్ద దుమారానికి తెరలేపారు. ఇటీవల గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయానంటూ ఓ నాటకం ఆడి అందరినీ బకరాలను చేసింది. మోడల్, నటి పూనమ్ పాండే చనిపోయారంటూ ఆమె సోషల్ మీడియా ఖాతాలోనే పోస్ట్ కనిపించడం.. ఆ తర్వాత తాను చనిపోలేదని చెబుతూ ఆమె వీడియో విడుదల చేయడం అంతా ‘ఆన్‌లైన్ పబ్లిసిటీ’లో నైతికతపై చర్చకు దారితీసింది. 32 ఏళ్ల పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్‌తో పోరాడి చనిపోయారంటూ శుక్రవారం ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ కనిపించింది. ఆ పోస్టును చాలా మంది నిజమేనని నమ్మేశారు. నిమిషాల్లోనే మీడియా సంస్థలు ఆమె చనిపోయారన్న వార్తలు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి.
ఆఖరికి నేను చనిపోలేదంటూ ఓ వీడియో విడుదల చేసిన సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కలిపించేందుకే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే పూనమ్ పాండేను ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ ప్రచారానికి అంబాసిడర్ గా మారవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు దీన్ని ఖండిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Read Also:Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు.. అర్ధరాత్రి అమిత్‌షాతో భేటీ
పూనమ్ ఇంకా మాట్లాడుతూ- ‘ఇతర క్యాన్సర్‌ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనికి HPV వ్యాక్సిన్, ముందస్తు గుర్తింపు పరీక్షలు ఉన్నాయి. ఈ వ్యాధితో ఎవరూ చనిపోకుండా ఉండేలా మన దగ్గర చికిత్స ఉంది. సర్వైకల్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే తన మరణాన్ని బూటకమని పూనమ్ పేర్కొంది.
పూనమ్ పాండే ఎవరు?
పూనమ్ పాండే వృత్తిరీత్యా మోడల్, నటి. 2013లో నషా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆమె అనేక సీరియల్స్, తెలుగు చిత్రాలలో కనిపించింది. ఇది కాకుండా, పూనమ్ 2011 సంవత్సరంలో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా కూడా మారింది.
Read Also:Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు.. అర్ధరాత్రి అమిత్‌షాతో భేటీ