Lucknow: అధునాతన సౌలభ్యాలతో రూపొంధించిన రైలు వందేభారత్. కాగా ఇది దేశం లోనే మొదటి హైస్పీడ్ రైలు. ఈ హైస్పీడ్ వందేభారత్ రైలును లక్నో లో ఈ ఏడాది జులై లో ప్రారంభించారు. అయితే ఈ రైలు తరచుగా రాళ్ళ దాడికి గురవుతుంది. ఇప్పటికే 4 సార్లు రాళ్ళ దాడికి గురైన ఈ రైలు గురువారం మరోసారి రాళ్ళ దాడికి గురైంది. దీనితో నాలుగు నెలల్లో ఈ రైలు రాళ్ళ దాడికి గురికావడం ఇది ఐదో సారి. వివరాలలోకి వెళ్తే.. గురువారం గోరఖ్‌పూర్ నుంచి లక్నోకు బయలుదేరింది వందేభారత్. ఈ నేపథ్యంలో వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపం లోకి రాగానే కదులుతున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడం వల్ల రైలు లోని సి6 కోచ్ లోని అద్దం పగిలిపోయింది.
Read also:Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రాళ్ల దాడిపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే సీనియర్ డీసీఎం రేఖా శర్మ మాట్లాడుతూ.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని.. అలానే ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా ఈ ఏడాది జులై 7వ తేదీన గోరఖ్‌పూర్ నుండి లక్నో వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు జులై 9వ తేదీ నుండి ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఈ రైలు సేవలు ప్రారంభమైన 2 రోజుల్లోనే అంటే జులై 11వ తేదీన రాళ్ల దాడికి గురైంది. ఈ దాడిలో రైలు అద్దాలు దెబ్బతినడంతో పాటు పై భాగం కూడా దెబ్బతింది. అలానే ఆగస్టు 3వ తేదీన గోరఖ్‌పూర్ జంక్షన్ లోని వాషింగ్ యార్డులో రైలు అద్దాలు పగులగొట్టారు.
Read also:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
ఆ తరువాత ఆగస్టు 6వ తేదీన బారాబంకి లోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మరో సారి ఈ రైలు రాళ్ల దాడికి గురైంది. ఈ ఘటనలో ఒక కోచ్ యొక్క రెండు అద్దాలు పగిలిపోయాయి. అలానే సెప్టెంబర్ 15న మల్హౌర్ స్టేషన్‌లో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి సి-4 కోచ్ కిటికీని ధ్వంసం చేశారు. కాగా నిన్న మరోసారి దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీనితో లక్నో వందే భరత్ రైలు రాళ్ళ దాడికి గురికావడం నాలుగు నెలల్లో ఇది ఐదోసారి.