Chalo Rajahmundry : వాహనాల తనిఖీలు ముమ్మరం.. ఆంధ్ర చెక్ పోస్టులో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని విఫలం చేసేందుకు పోలీసు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రి అంటూ పిలుపు నివ్వడంతో పోలీసు వర్గాలు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే అన్ని రోడ్లన్నీ పోలీసులు దిగ్బంధనం చేశారు. తిరువూరు, జంగారెడ్డి గూడెం కూనవరం వెళ్లే రోడ్లపై పోలీసులు భారీ భారీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అశ్వరావుపేట నుంచి రాజమండ్రి, భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధానమైన రహదారులపై బారి కెడ్ల ను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం ర్యాలీ నిర్వహిస్తామని సోషల్ మీడియా లో చంద్రబాబు అభిమానులు ప్రకటన జారీ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Also Read : JDS: బీజేపీతో జేడీఎస్ పొత్తు.. కీలక ముస్లిం నేత రాజీనామా..
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్న దృశ్యాలు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్లను చూపించాయి. ఛలో రాజమండ్రికి ఆంధ్రా పోలీసులు అనుమతి నిరాకరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. నివేదికల ప్రకారం, రాష్ట్రంలోకి ఐటీ ఉద్యోగుల ప్రవేశాన్ని పరిమితం చేయాలని విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా పోలీసు అధికారులను ఆదేశించారు. విజయవాడలో సీఆర్‌పీసీ 144 సెక్షన్ కింద ఆంక్షలు విధించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని మైలవరం ఏసీపీ రమేష్ తెలిపారు.
Also Read : PM Modi: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్” ప్రపంచ వాణిజ్యానికి కీలకం..
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!