Producer SKN Counter to Rashmi Gautham: అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడలో నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాలో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘బేబీ’ సినిమా టీమ్ బాయ్స్ హాస్టల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
Allu Arjun: పిల్లనిచ్చిన మామ కోసం సాగర్‌లో సందడి చేసిన అల్లు అర్జున్
ఈ ట్రైలర్ లో పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ సూపర్ హాట్ గా కనిపించింది. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వారం రోజుల్లోనే కన్ ఫర్మ్ అయిందని, షూటింగ్ కూడా అంతే ఫాస్ట్ గా జరిగిందని చెప్పుకొచ్చింది. కన్నడలో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యిందని, ఇలాంటి సినిమా తెలుగులో వస్తే మరో విజయం వచ్చినట్లేనని ఆమె అన్నారు. చాలా రోజుల తర్వాత గ్లామర్ రోల్ చేయడం ఆనందంగా వుందని, మంచి టీంతో కలసి పని చేశా,. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ.. బేబీ విడుదలైన సమయంలో ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించిందని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఇప్పుడీ సినిమాని తెలుగులోకి తీసుకురావడం ఆనందంగా వుందని అన్నారు. అలా అంటూనే కాలేజీ లో బాయ్స్ హాస్టల్ ఎప్పుడు వెళ్లినా.. రష్మీ గారు మీ ఫొటోస్ చాలా అంటించి ఉంటాయని అనడంతో ఆ మాట విని రష్మీ షాక్ అయింది. ఆ వెంటనే ఎస్కేఎన్ దాన్ని కవర్ చేశాడు అనుకోండి.
కాలేజీ లో బాయ్స్ హాస్టల్ ఎప్పుడు వెళ్లినా.. రష్మీ గారు మీ ఫొటోస్ చాలా అంటించి ఉంటాయి.#SKN #BoysHostel #RashmiGautam #NTVENT #NTVTelugu pic.twitter.com/mX3FVvRuqk
— NTV Telugu (@NtvTeluguLive) August 19, 2023